– వక్ఫ్ బోర్డ్ చట్టం 95 వలన పేద ముస్లింలకు న్యాయం జరగలేదు
– మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో వక్ఫ్ భూ బాధితుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చిన మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు, జేపిసి మెంబర్ డీకే అరుణ
– డీకే అరుణ తో పాటు పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్
– డీకే అరుణకు వినతి పత్రాలు అందచేసిన బోడుప్పల్ వక్ఫ్ భూ బాధితుల జేఏసి
మేడ్చల్: ‘‘వక్ఫ్ సమస్య అనేది దేశమంతటా ఉంది.వక్ఫ్ బోర్డ్ చట్టం 95 వలన పేద ముస్లింలకు ఎలాంటి న్యాయం జరగలేదు. వక్ఫ్ భూ బాధితులకు న్యాయం చేసేలా పార్లమెంట్లో స్పీకర్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ని ఏర్పాటు చేశారు. జేపీసీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ కమిటీలో పార్టీలకతీతంగా జేపీసీ ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే పార్లమెంటు సమావేశాలకి ఈ కమిటీ వక్ఫ్ బాధితుల అభిప్రాయాలను స్పీకర్ ఇవ్వడం జరుగుతుంది ’’ అని బీజేపీ ఎంపీ, జె పి సి సభ్యురాలు డికె అరుణ వ్యాఖ్యానించారు.
ముపై సంవత్సరాలకి పైగా అన్ని అనుమతులతో బ్యాంక్ లోన్ లతో ఇంటి నిర్మాణాలను చేపట్టి నివసిస్తున్న మాకు ఒక్కసారిగా 2018 లో వక్ఫ్ భూమి అంటూ తమ రిజిస్ట్రేషన్ ఆపడంతో సుమారు 8 వేలకు పైగా కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయని, బోడుప్పల్ వర్క్స్ భూ బాధితులు జె పి సి సభ్యురాలు డీకే అరుణకు విన్నవించున్నారు
ఈ సందర్భంగా డికె ఏమన్నారంటే.. బోడుప్పల్ వర్క్స్ భూ బాధితుల సమస్యలు వారి కష్టాలు గత 30 సంవత్సరాలుగా ఇంటి నిర్మాణాలు చేపట్టి నివసిస్తున్న వారి సమస్యలను జిపిసి కమిటీ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. బోడుప్పల్ భూ బాధితుల సమస్యలు ఎన్నికల సమయంలో పార్టీలకతీతంగా అన్ని పార్టీల వారికి విన్నవించుకున్నారు. వారి సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తాను.
ఎన్నికల సమయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, బోడుప్పల్ వక్ఫ్ భూ బాధితులు వారి సమస్యను చెప్పారు.వారికి అండగా ఉంటానని సిఎం రేవంత్ రెడ్డి మాటివ్వడం జరిగింది. తెలంగాణలో ఇలాంటి సమస్యలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేపిసి కి సలహాలు, సూచనలు తెలంగాణ నుండి పంపివ్వాలని కోరారు.