-మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి సవాల్
– బాధితులను పరామర్శించడానికి వచ్చిన మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి
– మాచర్ల పట్టణంలో హై టెన్షన్
– ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీగా చేరుకున్న టిడిపి శ్రేణులు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన పుట్టినరోజు వేడుకలు మాచర్ల పట్టణంలో ఘనంగా జరుపుకుంటూ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని బ్రహ్మారెడ్డి ఆరోపించారు. నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, తన సామాజిక వర్గంపై దాడి జరుగుతుంటే ప్రజలకు ఏమి సందేశాన్ని ఇస్తున్నాడు అని ప్రశ్నించారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వైసీపీ ప్రభుత్వంలో రక్షణ కరువైంది అన్నారు… ఇటువంటి అరాచక శక్తులకు అధికారాన్ని ఇస్తే అందరి మీద దాడులు జరుగుతాయని ఆరోపించారు. నాలుగు సార్లుగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తే , ప్రతి మండలంలో హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నావు అన్నారు. పోలీసుల అండదండలతో నియోజకవర్గంలో శాంతి భద్రతలను తన చేతిలో ఉంచుకొని, అరాచక శక్తులతో హత్య రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నారు అని విమర్శించారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. హత్య రాజకీయాలు చేయటం కాదు. ప్రజాక్షేత్రంలోకి రా తేల్చుకుందాం అని సవాల్ విసిరారు. ఈ కేసును నీరు కార్చే విధంగా పోలీసులు బాధితుడు వద్దనుండి, వాంగ్మూలం తీసుకున్న పేపర్ మీద మాత్రమే కాకుండా ఖాళీ పేపర్ల మీద వేలిముద్రలను తీసుకోవడం, అనుమానాలకు తావిస్తోంది అన్నారు.
మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో టిడిపి శ్రేణులు నినాదాలు చేయడంతో ఆసుపత్రి ప్రాంగణమంతా ఉద్రిక్తత నెలకొంది.