న్యాయవ్యవస్థలో అమూల్యమైన సేవలు
హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
ఘనంగా వీడ్కోలు కార్యక్రమం
అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఎ.వి.శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న శేషసాయి పదవీ విరమణ చేయనున్న నేప థó్యంలో శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాలులో ఘనంగా వీడ్కోలు కార్యక్ర మం జరిగింది. ఈ సందర్భంగా ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ జస్టిస్ శేషసాయి సహనానికి పెట్టింది పేరుగా న్యాయవ్యవస్థలో అమూల్యమైన సేవలు అందించారని ప్రశంసించారు. తన కేరీర్‌లో సుమారు 23 వేల కేసులను పరిష్క రించడం జరిగిందని పేర్కొన్నారు. ఆయన శేషజీవితం ఆయురారోగ్యాలతో సుఖ శాంతులతో సాగాలని ఆకాంక్షించారు.
సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు
జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ ముందుగా తన న్యాయమూర్తిగా తన కెరీర్‌లో సహాయ సహకారాలు అందించిన వారికి ప్రత్యేకంగా కృతజ్ణతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ దేశంలోని అత్యుత్తమ బార్ అసోసియే షన్లలో ఒకటని పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసి క్యూటర్ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ శేషసాయి పలు సివిల్, క్రిమినల్ చట్టాలకు సంబంధించి అనేక అంశాల్లో చురుకైన పాత్రపోషించి న్యాయ వ్యవస్థకు మంచి సేవలు అందించారని కొనియా డారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.చిదంబరం మాట్లాడుతూ జస్టిస్ శేషసాయి న్యాయమూర్తిగా అనేక అంశాల్లో కీలకమైన తీర్పులు ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాధ్‌రెడ్డి మాట్లాడుతూ 25 ఏళ్లు న్యాయవాదిగా, 11 సంవత్సరాలు న్యాయమూర్తిగా విశేషమైన సేవలు అందించారని కొనియాడారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్‌రావు, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు, పలువురు ఇతర రిజిష్ట్రార్లు, సీనియనిర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అధారిటీ, ఏపీ జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.