కులగణనతో బీసీలకు న్యాయం చేయాలి

– మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌, మహానాడు: దేశవ్యాప్తంగా కులగణన కోసం ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14 తేదీ శనివారం హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద చేపట్టనున్నఓబీసీ సత్యాగ్రహంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పాల్గొనాలని మాజీ మంత్రి, భారాస ముఖ్య నాయకుడు వి.శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సత్యాగ్రహలో దేశవ్యాప్తంగా కులగణన చేసి రిజర్వేషన్స్ పై ఉన్న 50% సీలింగ్ ఎత్తివేయాలని బీసీలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఓబీసీ నేషనల్ ఫెలోషిప్ లను 5 వేలకు పెంచాలని డిమాండ్ చేయనున్నాం.

దేశవ్యాప్తంగా వెంటనే కులగణన చేసి, బీసీలకు న్యాయం చేకూర్చాలని, తెలంగాణ రాష్ట్రంలో కూడా హైకోర్టు చెప్పినట్టు ప్రభుత్వం మూడు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని కులాలగణన చేయాలని, 42% బీసీ రిజర్వేషన్స్ స్థానిక సంస్థలో అమలుచేయాలని, కులాల అభివృద్ధి కులగణనతోనే సాధ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతున్న ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ వారికి తమ సంపూర్ణ మద్దతునిచ్చారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్, జాతీయ కార్యదర్శి ఎన్‌.సాయికిరణ్, రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అభినేష్, బొమ్మ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడిని కలిసి ఓబీసీ సత్యాగ్రహకు రావలసిందిగా విజ్ఞప్తి చేశారు.