రామవరంలో జ్యోతుల నెహ్రూ విస్తృత ప్రచారం

జగ్గంపేట, మహానాడు: జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వర ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా జననీరాజనాలతో మహిళల మంగళహారతులతో గ్రామం అంతా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కూటమి వస్తే మహిళలకు సూపర్‌ సిక్స్‌ పథకాలు, వృద్ధులకు 4000 పెన్షన్‌, దివ్యాంగులకు 6000 పెన్షన్‌, రైతులకు కౌలు రైతులకు సంవత్సరానికి 20 వేల రూపాయలు, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతాయని వివరించారు. ఈ రాష్ట్రంలో అమరావతి రాజధానిగా పరిశ్రమలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు నడిపించే సత్తా సామర్థ్యం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.