– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి
కడప, మహానాడు: కాదంబరి జెత్వానీ వేరే రాష్ట్రానికి చెందిన మహిళ… ఏపీ కమిషన్ కి అక్కడి వరకు పరిధి లేదు…. ఆమెపై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి అన్నారు. ఆ రాష్ట్రంలో మహిళా కమిషన్ ఆమెకు ఏదైనా అన్యాయం జరిగితే స్పందించే అధికారం ఉందన్నారు. కడప సెంట్రల్ జైల్లో మహిళల జైల్ ను సందర్శించడానికి వచ్చిన ఆమె.. మీడియాతో మాట్లాడారు. గుడ్లవల్లేరు హాస్టల్ సంఘటనపై కమిషన్ సీరియస్ గా తీసుకుందని, అక్కడ అనేక అనుమానాలు ఉన్నాయని విచారణ చేపట్టి, అక్కడున్న వార్డెన్, ప్రిన్సిపాల్, సిబ్బందికి నోటీసులు జారీ చేశామని వెంకట లక్ష్మి పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే విద్యుత్ తీశారు.. పిల్లలని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి… విద్యార్థినులు జీవితాలతో చెలగాటం ఆడుకోవడానికి తీవ్రంగా తీసుకున్నామని తెలిపారు. వారికి పోషక ఆహారం, వసతులు, ఆరోగ్య సేవలను పరిశీలిస్తామన్నారు.
జైళ్ళలో ఉన్న మహిళా ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళా జైలుని తనికీ చేస్తాం… మహిళా కమిషన్ ప్రతి బాధిత మహిళకు అండగా నిలుస్తుంది… ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందించి వాటికి న్యాయం చేస్తాం.. పనిప్రదేశాల్లో మహిళలపై వేధింపులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని ఆమె చెప్పారు. చిన్న పిల్లలపై జరిగే అత్యాచారాలపై మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంటుందని తెలిపారు.