– కోర్టులో ఫైళ్లు లేపేసిన గజదొంగ గోవర్ధన్ రెడ్డి
– డాక్యుమెంట్ల ముఠాలకు, మద్యం మాఫియాకు లీడర్
– ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆరోపణ
నెల్లూరు, మహానాడు: కొండలను మింగిన అనకొండ కాకాణి… కోర్టులో ఫైళ్లు లేపేసిన గజదొంగ గోవర్ధన్ రెడ్డి… నకిలీ డాక్యుమెంట్ల ముఠాలకు, కల్తీ మద్యం మాఫియాకు లీడర్ కూడా ఆయనే… వైసీపీ హయాంలో ఆయన తవ్విన గ్రావెల్ గుంతలను సోమిరెడ్డికి ఆపాదించే కుట్రకు తెరలేపారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేసి నేరాలు ఘోరాలకు శిక్ష తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారని ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయంలో మీడియాతో ఇంకా ఏమన్నారంటే… ఎన్ని వేషాలు వేసినా కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకు శిక్ష తప్పించుకోలేరు.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. వైసీపీ హయాంలో అష్టకష్టాలు పడిన ప్రజలు ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు. ప్రజల సంతోషం నెల్లూరు జిల్లాలోని తోడేరు రెడ్డికి నచ్చడం లేదు. నిత్యం ప్రెస్మీట్లు పెట్టుకుంటూ ఓ వైపు చంద్రబాబు నాయుడిని, మరోవైపు చంద్రమోహన్ రెడ్డిని తిడుతూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. నోటికొచ్చిన అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో ఉన్నారు.
సర్వేపల్లి ప్రజలు కాకాణి గుణపాఠం నేర్వాలని ఓడించి ఇంట్లో కూర్చొబెట్టారు. శ్మశానానికి మట్టి తొలినా, ప్రజలు సొంత అవసరాలకు తోలుకున్న సోమిరెడ్డి, ఆయన కొడుకు అమ్మేసుకున్నారంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా, రెండేళ్లు మంత్రిగా వెలగబెట్టి ముత్తుకూరులో శ్మశానానికి తట్ట మట్టి తొలకపోయినందుకు కాకాణి సిగ్గుపడాలి. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ప్రభగిరిపట్నంలో కొండలు ఎత్తేయడంతో పాటు దేవుడి విగ్రహాలను కూడా ఆయన వదిలిపెట్టలేదు.
వైసీపీ పాలన సమయమంతా ఇసుక, గ్రావెల్, క్వార్ట్జ్ అక్రమ రవాణాతో సొంత ఖజానా నింపుకొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏరోజూ ప్రజల సమస్యలు పట్టలేదు. అక్రమాలు, అవినీతితో వందల కోట్లు దోచుకుని ఈ రోజు ఇంట్లో కూర్చుని అబద్ధాలు చెప్పుకుంటూ గడిపేస్తున్నారు. మూడు పూట్లా తిని ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. చేసిన పాపాలకు జైలుకు పోవడం తప్పదని తెలియడంతోనే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రకరకాల అబద్ధాలు చెప్పుకొంటున్నారు. తాను చేసినట్టే అందరూ దొంగతనాలు, అక్రమ మైనింగ్ చేస్తారని భావిస్తున్నట్టున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన కుమారుడు గతంలో అవినీతికి పాల్పడితే మొన్నటి వరకు వాళ్ల ప్రభుత్వంలో చర్యలు తీసుకోకుండా కాకాణి ఏం చేస్తున్నారు? వైసీపీ హయాంలో లెక్కకు మించి పాపాలు చేసిన కాకాణితో పాటు ఆయన చెంచాలు జైలుకు పోవడం ఖాయం!