Mahanaadu-Logo-PNG-Large

కళాపిపాసి ‘అలమండ ప్రసాద్‌’

-శాస్త్రీయ నృత్యంలో రాణిస్తూ వేలాదిగా ప్రదర్శనలు
-సాగర సంగమం ప్రేరణతో చిన్నవయసులోనే అరంగేట్రం
-దేశ, అంతర్జాతీయంగా అవార్డులు, రికార్డులు సొంతం
-గిన్నిస్‌, వండర్‌, తెలుగు బుక్‌ రికార్డ్స్‌లో స్థానం
-కళాకారులను ప్రోత్సహిస్తూ ముందడుగు

కాకినాడ, మహానాడు: ‘సాగర సంగమం’ చిత్రంలో కమల్‌హాసన్‌ నృత్య ప్రదర్శన గుర్తుండే ఉంటుంది. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక కలికితురాయిగా నిలిచిపోయే ఈ సినిమా ఎందరో కళాకారులకు ప్రేరణగా నిలిచిందనడంలో అతిశయోక్తి కాదు. ఈ చిత్రం స్ఫూర్తి చిన్న వయసులోనే ఓ బాలుడిలో ప్రేరణ నింపేలా చేసింది. సంప్రదాయ నృత్యంపై ఆసక్తిని పెంచింది. పట్టుదల, కృషికి తల్లి సహకారం తోడవడంతో ఏడో తరగతి చదివే వయసులోనే బాలుడు నృత్య శిక్షణలో ఆరంగేట్రం చేశాడు. అంచ లంచలుగా ఎదుగుతూ దేశ అంతర్జాతీయంగా ప్రదర్శనలు ఇస్తూ గుర్తింపు తెచ్చు కున్నారు. పట్టుదల, కృషి పెట్టుబడిగా శ్రమిస్తే ఏ రంగంలో నైనా అవలీలగా రాణించవచ్చునని నిరూపించారు. ఆయనే ప్రముఖ నాట్యకళాకారుడు, అలమండ ప్రసాద్‌. వృత్తిపరంగా ఎన్ని బాధ్యతలు ఉన్నా భారతదేశ సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి సృత్యాల్లో తనదైన శైలిలో రాణిస్తున్నారు. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలుగుబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకు న్నారు.

సాగరసంగమంలో కమల్‌ నృత్యం ప్రేరణ
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన అలమండ ప్రసాద్‌ అలమండ తాతారావు, మంగతాయారమ్మలకు నాల్గవ సంతానం. భార్య దుర్గాభవాని, ముగ్గు రు పిల్లలు, ఇద్దరు అక్కలు, ఒక చెల్లితో పాటు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. ప్రసాద్‌ 7వ తరగతి చదువుతున్నప్పుడు వచ్చిన ‘సాగర సంగమం’ చిత్రంలో కమల్‌ హాసన్‌ చేసిన నృత్య ప్రదర్శనకు ఆకర్షితుడయ్యాడు. అప్పటినుంచి తనకు సంప్రదాయ నృత్యంపై ఆసక్తి పెరిగిందని చెబుతున్నారు. ఆయనకున్న పట్టుదలకు తల్లి మంగతాయారమ్మ పూర్తిగా సహకరించి ప్రోత్సహించడంతో నృత్యశిక్షణకు 7వ తరగతిలో అరంగేట్రం చేశాడు.

కాకినాడలో నృత్య గురువులు
నృత్యంపై ఉన్న ఆసక్తితో ప్రసాద్‌ కాకినాడకు చెందిన దేవి నృత్యనికేతన్‌ నిర్వాహకు లు సత్యనారాయణ దగ్గర శిక్షణకు చేరారు. అక్కడినుంచి భరతనాట్యం, కూచి పూడిలలో కొంత ప్రావీణ్యం పొందారు. పూర్వపు గురువు సత్యనారాయణ కాగా ప్రస్తుతం కాకినాడకు చెందిన నృత్యాంజలి కళానిలయం నిర్వాహకులు హరిలోకేష్‌ శర్మ, కృష్ణవేణి దంపతుల వద్ద ఇప్పటికీ తర్పీదు పొందుతున్నారు. నేటికీ దేశం లోని పలు ప్రాంతాలు, ఇతర దేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు.

ఇచ్చిన నృత్య ప్రదర్శనలు
1988వ సంవత్సరంలో సామర్లకోట పట్టణంలోని మున్సిపల్‌ అడిటోరియం ప్రారంభ కార్యక్రమంలో తొలి నృత్యప్రదర్శన ఇచ్చిన ప్రసాద్‌ తదుపరి అంచలంచ లుగా ఎదిగి సింగపూర్‌, వియత్నాం, మలేషియా, బ్యాంకాక్‌, దుబాయ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఢల్లీి, ముంబయి, డెహ్రడూన్‌, ఉత్తరప్రదేశ్‌, వారణాసి, చెన్నై, భువనే శ్వర్‌, విజయవాడ, హైదరాబాద్‌లో నృత్యప్రదర్శనలు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయి కూచిపూడి నృత్యప్రదర్శనలే కాకుండా పంచారామక్షేత్రాలు, సామర్లకోట, ద్రాక్షారామం, పాదగయ క్షేత్రం, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రంలో స్వామివారి బ్రహోత్సవాలకు, పద్మావతి అమ్మవారి బ్రహోత్సవాలు, తిరుమల వెంకటేశ్వరుని సన్నిధి నాద నీరాజనంలోనూ తన నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అలాగే గోదావరి పుష్కరాల్లోనూ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. 52 ఏళ్ల వయసులోనూ అవలీలగా ప్రదర్శనలిస్తూ మన్ననలు అందుకుంటున్నారు.

వరించిన అవార్డులు
రాజమండ్రికి చెందిన అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వారిచే ‘ఆంధ్రశ్రీ పురస్కారం, బెస్ట్‌ సిటిజన్‌ ఆప్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆవార్డును విశాఖపట్నం, రాజమండ్రి ఫిలంథ్రోపిక్‌ సొసైటీ వారిచే సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జీవిత సాఫల్య పురస్కారం, మదర్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో సినీనటుడు సుమన్‌ చేతులమీదుగా ఆంధ్ర కళా సామ్రాట్‌ అవార్డు, తిరుపతికి చెందిన రంగస్థ లి మాసపత్రిక ఇచ్చిన ఎన్టీఆర్‌ స్మారక పురస్కారం, వియత్నాం పైదా ఇంటర్నేషన ల్‌ ఎక్స్‌లెన్సీ అవార్డు, మలేషియా తెలుగు అసోసియేషన్‌ హేవళంబి ఉగాది పురస్కారం, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చేతులమీదుగా హైదరాబాద్‌ బింగి మల్లీశ్వరి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2017 ఎక్స్‌లెన్సీ అవార్డు, విశాఖపట్నంకు చెందిన అర్పిత సంస్థ ఇచ్చిన బెస్ట్‌ సిటీజన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అవార్డు, తెలంగాణాకు చెందిన టీచర్స్‌ అసోసియేషన్‌ ఆటా పురస్కారం, కర్నాటక కు చెందిన నేషనల్‌ క్లాసికల్‌ డ్యాన్స్‌ అకాడమీ గురు సద్భావనా అవార్డు, ప్రెడ్‌ ఇండియా ఎక్స్‌లెన్సీ అవార్డులను విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు చేతుల మీదుగా అందుకున్నారు.

గిన్నిస్‌, వండర్‌, తెలుగు బుక్‌ రికార్డ్స్‌లో చోటు
మహరాష్ట్ర షిర్డీ సాయినాధుని సన్నిధితో పాటు, ఉత్తరప్రదేశ్‌ కాశీ విశ్వేశ్వరుడి పుణ్యక్షేత్రం, తిరుమల వెంకటేశ్వరుని సన్నిధి, చెన్నై తిరువిరక్కాడు అమ్మవారి సన్ని ధిలో ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలలో వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌తో పాటు, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను కైవసం చేసుకున్నారు. అంతటితో ఆగక వండర్‌ బుక్‌ రికార్డ్స్‌ సౌత్‌ ఇండియా కో ఆర్డినేటర్‌ బింగి నరేంద్రగౌడ్‌ ఆయన నృత్యకళను గుర్తించి తూర్పు గోదావరి జిల్లాకు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కో ఆర్డినేటర్‌గా నియమించి అభినం దించారు.

వండర్‌ బుక్‌ రికార్డ్స్‌ కో ఆర్డినేటర్‌గా ప్రోత్సాహం
వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కోఆర్డినేటర్‌గా ప్రసాద్‌ ఇప్పటివరకూ కోస్తాంద్ర, విశాఖ, ఉభయ గోదావరి, జిల్లాల్లో అనేక మందికి అవార్డులిస్తూ ముందుకు సాగుతున్నా రు. ఒకవైపు రికార్డులు, అవార్డులు తీసుకుంటూ మరోవైపు అవార్డులతో కళాకారు లను ప్రోత్సహిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో మరింత ప్రావీణ్యం సంపాదించి ఆశయాన్ని అందిపుచ్చుకు నేందుకు ప్రోత్సహిస్తున్నారు. అలాగే 2019 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగం గా ఉత్తమ కళాకారుడిగా ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నారు.

కళాకారులకు ప్రసాద్‌ సందేశం
భారతదేశంలో అంతరించిపోతున్న సాంప్రదాయ కళలను పరిరక్షించాలని, అందు కు విద్యార్థులు చిన్నతనం నుండే చదువుతో పాటు సాంప్రదాయ నృత్య కళల్లో శిక్షణ పొందడంతోనే సాధ్యమని ప్రసాద్‌ తెలిపారు. నృత్య శిక్షణతో శారీరక, మానసిక ఆరోగ్యం కలగడంతో పాటు, జీవితంలో అనేకమందికి ఆదర్శవంతంగా ఉండేలా కళాకారులు ముందుకుసాగాలని సందేశమిస్తున్నారు. తాను ఈ రంగం లో రాణించేందుకు సహకరించిన గురువులు హరిలోకేష్‌ శర్మ, కృష్ణవేణి దంపతుల కు, బింగీ నరేంద్ర గౌడ్‌, కుటుంబసభ్యులకు రుణపడి ఉంటానని చెప్పారు.