కళ్యాణ కారకం రామ తారక మంత్రం

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి
అల్లూరు గ్రామంలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు

నందికొట్కూరు : ఈ దేశంలో పుట్టిన ఎందరో మహనీయులు రామనామాన్ని పట్టుకుని తరించారని అటువంటి తారక మంత్రం నాడు నేడు ఎల్లవేళలా జీవులకు భవబంధాల నుండి విముక్తిని ప్రసాదిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నందికొట్కూరు మండలం, అల్లూరు గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నాలుగు రోజుల ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేసిన సందర్భంగా వారు ప్రారంభోపన్యాసం చేశారు. భగవద్గీత ప్రచారకులు వి.నాగేశ్వర రెడ్డి భక్తి తత్వాన్ని గురించి చక్కగా వివరించారు.

ఈ కార్యక్రమంలో కె.సి. నాగలక్ష్మయ్య, అర్చకులు డి.చంద్రశేఖర్, జి.జయరామి రెడ్డి, యం. రత్నాకర్ రెడ్డి, జి.లక్ష్మీదేవమ్మ, వి.లక్ష్మన్న, కె.పి.నాగలక్ష్మయ్య, జి విష్ణు నాయుడు, జి.చిన్నపుల్లన్న, జి. వెంకటేశ్వర్లు, బి. వెంకటరమణ, జి. మద్దిలేటి, యం. లక్ష్మీరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.