కరీంనగర్‌లో కమల వికాసం ఖాయం

తెలంగాణలో మెజార్టీ సీట్లు తథ్యం
రేవంత్‌ తమ విజయాన్ని ధ్రువీకరించారు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌

కరీంనగర్‌, మహానాడు : కరీంనగర్‌లో కమల వికాసం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. బంపర్‌ మెజారిటీతో విజ యం ఖాయమని తెలిపారు. ఓటేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణలో మెజారిటీ సీట్లు తథ్యమని, బీజేపీ గెలుపును సీఎం రేవంత్‌రెడ్డే ధ్రువీకరించారని వ్యాఖ్యానించారు. ఓటమి ఖాయమనే టెన్షన్‌ సీఎం ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ కోపంతోనే ఎన్నికల కోడ్‌ను ఉల్లం ఘించి మాట్లాడారని మండిపడ్డారు. రాజకీయాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై రేవం త్‌ రెడ్డి ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ లను అమలుచేయాలని కోరారు. లేనిపక్షంలో అమలయ్యే దాకా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.