సోమిరెడ్డికి జై కొట్టిన కంటేపల్లి

-వైసీపీ నుంచి భారీగా టీడీపీలోకి వలసలు

నెల్లూరు, మహానాడు: వెంకటాచలం మండలం కంటేపల్లి పంచాయతీకి చెందిన 57 కుటుంబాలు ఆదివారం సర్వేపల్లి అభ్యర్థి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరులోని వేదాయపాళెం కార్యాలయంలో వారికి సోమిరెడ్డి జెండా కప్పి ఆహ్వానించారు.

ఏ ముఖం పెట్టుకుని రైతుల ఓట్లు అడుగుతావ్‌ కాకాణీ
మనుబోలు మండలం చెర్లోపల్లిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డేగపూడి – బండేపల్లి కాలువ విషయంలో మాట మీద నిలబడే దమ్ముందా అని ప్రశ్నించారు. కాలువ పని పూర్తిచేయకుండా 2024 ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన మాట గుర్తుందా అని అడిగారు. ప్రభుత్వానికి ధాన్యం విక్రయిస్తే రైతుల వద్ద పుట్టికి 150 కిలోల నుంచి 200 కిలోలు అదనంగా గుంజుకున్నారు..ఈ అదనపు ధాన్యం సొత్తు ఎవరింటికి వెళ్లింది? ఆర్నెళ్లకు కూడా ధాన్యం డబ్బులు చెల్లించకుండా రైతుల్ని కార్యాలయల చుట్టూ తిప్పారు. ధాన్యం ధరను పుట్టి రూ.7 వేలు నుంచి రూ.8 వేలకు తగ్గించి ఎందుకు కొన్నారు? రైతులు, వ్యవసాయం, మద్దతు ధర, నీటి యాజమాన్యం గురించి మాట్లాడే అర్హత కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు.