కాపుల ఆత్మీయ సమావేశంలో కన్నా, భాష్యం ప్రవీణ్‌

పల్నాడు జిల్లా పెద్దకూరపాడు, మహానాడు : పెదకూరపాడు అమరావతి సత్యసాయి కళ్యాణ మండపంలో మంగళవారం ఏర్పాటు చేసిన మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కాపుల ఆత్మీయ సమావేశంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌ పాల్గొన్నారు. ఎన్నికల్లో కూటమి విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.