పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజా వేదిక, సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్లలో అంబేద్కర్ విగ్రహాల కు ఆదివారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త, బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను ఆచరణలోకి తీసుకు రావడమే ఆ మహనీయుడికి మనం అందించే అసలైన నివాళి అని కొనియా డా రు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు.