హనుమాన్‌ జయంతి సందర్భంగా కన్నా పూజలు

గుంటూరు: హనుమాన్‌ జయంతి సందర్భంగా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ శనివారం గుంటూరు నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రామభక్తి పరాయణుడు, నవ వ్యాకరణుడు, భక్తి భావానికి ఆద్యుడు, విజయానికి చిహ్నం ఆంజనేయ స్వామి. మనో ధైర్యానికి నిజమైన నిదర్శన రూపం.. గురు స్వరూపం హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.