సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ లో సత్తెనపల్లి – నరసరావుపేట రూట్ కొత్త బస్సు సర్వీసును ప్రారంభించారు. అనంతరం మొదటి టికెట్ కొనుగోలు చేశారు. ముప్పాళ్ళ గ్రామంలో కంచర్ల కృపారావు ఇంటికి టీ బ్రేక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే గ్రామంలో కంచర్ల మణి రావు – కృపారావు సహకారంతో, ముప్పాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్మితమైన కొత్త సమావేశ మందిరాన్నిప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల గ్రామ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.