కర్నాటక: మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను గురువారం అర్ధరాత్రి బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి వచ్చిన ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. వెంటనే సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విచారణ నిమిత్తం సీఐడీ కార్యాలయానికి తరలించారు.