కేసీఆర్‌…దమ్ముంటే ఉస్మానియాకొచ్చి మాట్లాడు…

పదేళ్లు ఏం పీకావని మాట్లాడుతున్నావు
విద్యార్థి నాయకుడు లోకేష్‌ యాదవ్‌ ఫైర్‌

హైదరాబాద్‌, మహానాడు : ఓయూ ఆర్ట్స్‌ కాలేజ్‌ ముందు కేసీఆర్‌ ఓయూపై అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా విద్యార్థి నాయకుడు లోకేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు మంగళవారం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లోకేష్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కరోజు కూడా ఓయూ గురించి మాట్లాడని, ఎటువంటి అభివృద్ధి చేయని కేసీఆర్‌ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. కష్టపడి చదువుకున్న విద్యార్థులను మోసం చేసి ఉద్యోగాల పరీక్ష పేపర్లు అమ్ము కున్న దుర్మార్గుడు కేసీఆర్‌ అని ధ్వజమెత్తారు.

కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులను మోసం చేసింది కేసీఆర్‌ మాత్రమేనన్నారు. 7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రా న్ని దోచుకుని సర్వనాశనం చేశారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సర్వశక్తుల కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంతో బిజీ షెడ్యూల్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నా కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల ప్రేమతో విద్యుత్‌ శాఖ, జలమం డలి, యూనివర్సిటీ అధికా రులతో మాట్లాడి విద్యార్థుల పక్షాన నిలబడ్డారని, హాస్టల్స్‌ బంద్‌ చేయమని, ఆహారం, నీటి, కరెంటు సమస్యలు రాకుండా ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పిన భట్టికి ఓయూ విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.