Mahanaadu-Logo-PNG-Large

లిక్కర్‌ స్కామ్‌ విచారణలో కేసీఆర్‌ ప్రస్తావన

-మీడియాలో కథనాలను ఖండిరచిన కవిత న్యాయవాది
-తప్పుగా అన్వయించుకున్నారని మండిపాటు

ఢిల్లీ హైకోర్టులో మంగళవారం లిక్కర్‌ స్కామ్‌ విచారణ జరిగింది. అయితే మద్యం విధానం, రిటైల్‌ వ్యాపారం గురించి కేసీఆర్‌కు కవిత ముందే వివరాలు చెప్పినట్లు ఈడీ వాదనలు వినిపించిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని కవిత న్యాయవాది మోహిత్‌రావు ఖండిరచారు. ఈడీ వాదనల్లో కేసీఆర్‌ ప్రస్తావన జరగలేదు. కోర్టులో ఈడీ న్యాయవాదులు ప్రస్తావించింది మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులురెడ్డి గురించి అని తెలిపారు. దీనిని కేసీఆర్‌కు అన్వ యించి వార్తలు ప్రసారం చేయడం సరికాదని తెలిపారు. రాఘవరెడ్డి తండ్రి శ్రీనివాసు లురెడ్డి అంటూ ఈడీ చేసిన వాదనలను కవిత తండ్రి కేసీఆర్‌ అని మీడియా తప్పుగా అన్వయించిందని తెలిపారు. ఎక్కడా కూడా కేసీఆర్‌ పేరు రాయలేదని, వాదనల సందర్భంగా ఈడీ ప్రస్తావించిన మాగుంట రాఘవ వాంగ్మూల పత్రాన్ని బహిర్గతం చేశారు. మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసు లురెడ్డికి లిక్కర్‌ కేసులో ఉన్న వారిని పరిచయం చేశానని చెప్పారని తెలిపారు. అయితే కేసీఆర్‌పై కొందరు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.