Mahanaadu-Logo-PNG-Large

పనికిరాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి

-జైల్లో పెడతా అంటే భయపడే వ్యక్తిని కాదు
-భట్టి విక్రమార్క కాదు..వట్టి విక్రమార్క
-ఖమ్మం ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ పైర్‌

ఖమ్మం, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం రోడ్డు షోలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఖమ్మం లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఎండ ఉన్నా సభకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పంజాబ్‌ కంటే ఎక్కువగా మనం ధాన్యం పండిరచాం. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెప్పింది. సీఎం రేవంత్‌ రెడ్డి వంటి దద్దమ్మలు మనకు ఎందుకు. ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా పూర్తి కావాలని దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌ నిర్మాణం చేశాం. నేను సీఎంగా ఉన్న సమయంలో నరేంద్ర మోదీ ఇటువంటి ప్రతిపాదన తెచ్చాడు. మా రాష్ట్రానికి చెందిన నీటిని ముట్టుకునే సమస్య లేదని తెగేసి చెప్పా. కేంద్రంలో బీజేపీ 200 సీట్లు కూడా దాటని పరిస్థితి.

తెలంగాణ రాష్ట్రంలో మనం 12 సీట్లు గెలవబోతున్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ బోతుంది. ఎంపీగా నామాను గెలిపిస్తే నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారు. బీఆర్‌ఎస్‌ అయితేనే పేగులు తెగే వరకు పోరాటం చేస్తుంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల సమ యంలో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఎన్టీఆర్‌ వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో సంక్షేమ పాలన వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్‌ను మించి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాం. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు. ఇప్పుడు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నారు. ఆయనకు నేను చెప్పేది ఒకటే ప్రజలతో పెట్టుకుంటే నాశనం అవుతారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఏ ఒక్కరోజు కరెంట్‌ పోలేదు…కాంగ్రెస్‌ వచ్చాక నిత్యం కరెంట్‌ కోతలేనని ధ్వజమెత్తారు.

భట్టి విక్రమార్క కాదు…వట్టి విక్రమార్క..
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీకి నీళ్లు ఇచ్చే దిక్కు లేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లో వరి కోతలు, కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌ కోతలు. రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేస్తానని ఇంతవరకు చేయలేదు. మాజీ మంత్రి హరీష్‌ రాజీనామా చేసిండు, నువ్వు అలా చేయగలవా రేవంత్‌ రెడ్డి అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని నేను ప్రశ్నిస్తే నిన్ను జైల్‌లో వేస్తా, కళ్లు గుడ్డు పీకుతా అని బెదిరిస్తున్నారు. జైలులో వేస్తా అంటే భయపడే వ్యక్తి కాదు కేసీఆర్‌. నాగార్జున సాగర్‌లో 432 అడుగుల నీరు ఉన్న పంటలకు నీరు అందించలేని స్థితిలో కాంగ్రెస్‌ ఉంది. నేలకొండపల్లి మండలంలో పంటలు ఎండిపోయాయని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి బాధపడుతున్నారు. రైతుబంధు కూడా అమలు చేయలేదంటున్నారు.

ఖమ్మం నగరంలో మూడు రోజులకు ఒకసారి మంచి నీరు వస్తుంది, మా పాలనలో నిత్యం ఇచ్చామన్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో కని విని ఎరుగని రీతిలో రోడ్‌ షో జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసింది. మెడికల్‌ కళాశాలల మంజూరు, నవోదయ స్కూల్‌ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయలేదు. మన నాయకుడు కేసీఆర్‌ రైతుల పక్షపాతి. ఆయన రైతులకు 24 గంటల కరెంటు, నీళ్లు అందించి రైతులకు అండగా నిలిచారు. తెలంగా ణ గొంతుక పార్లమెంట్‌ లో వినిపించాలి అంటే మీ బిడ్డను ఆశీర్వదించి మరోసారి పార్లమెం టుకు పంపాలని కోరారు.