భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ ముద్దుగుమ్మ చంద్రిక రవి మోడలింగ్ లో కెరీర్ ను ఆరంభించి ప్రస్తుతం నటిగా సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డాన్సర్ గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ అమ్మడు 2018లో భారతీయ చలనచిత్రం ఇరట్టు అరైయిల్ మురట్టు కుత్తు సినిమాలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. చీకటి గదిలో చితక్కొట్టుడు ఒరిజినల్ వర్షన్ లో ఈమె నటించి తన అందాలతో అలరించింది. 16 ఏళ్ల వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా థియేటర్, ఫిల్మ్ టీవీ లో ప్రదర్శలు ఇవ్వడం ప్రారంభించింది. 2014 లో మిస్ మాగ్జిమ్ ఇండియాలో రన్నరప్ గా టైటిల్ ను గెలుచుకుంది. 2012 లో మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా, మిస్ ఇండియా ఆస్ట్రేలియా ఫైనలిస్ట్ గా నిలిచిన భారతీయ సంతతి మహిళగా కూడా చంద్రిక రవి నిలిచింది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వైట్ ఖరీదైన కారు ముందు బ్లాక్ డ్రెస్ లో క్లీ వేజ్ షో చేస్తూ మోడ్రన్ డ్రెస్ లో చూపు తిప్పుకోనివ్వకుండా అందాల విందు చేస్తున్న ఈ అమ్మడికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.