సంఘ్ కార్యకర్త నుంచి కిషన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం

హైదరాబాద్‌: కేంద్రమంత్రిగా మరోసారి ఎంపికైన కిషన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం చూస్తే సంఘ్ కార్యకర్త అయిన కిషన్‌రెడ్డి 1977లో జనతా పార్టీలో చేరారు. 2001లో బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా చేశారు. 2004లో హిమాయత్‌ సాగర్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009, 2014లో అంబర్‌పేట నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021లో కేబినెట్‌ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృ తిక, పర్యాటక శాఖ మంత్రిగా నియమితులయ్యారు.