వైద్యురాలిగా మీ సమస్యలు తెలుసు

విభిన్న ప్రతిభావంతులకు అండగా ఉంటా
మానవత్వం లేని ఈ ప్రభుత్వాన్ని సాగనంపండి
దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి

ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : వైద్యురాలిగా మీ సమస్యలు తెలుసు…విభిన్న ప్రతిభావంతులకు అండగా ఉంటానని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భరోసా ఇచ్చారు. ఆమె నివాసంలో శనివారం నియోజకవర్గ స్థాయి విభిన్న ప్రతిభావంతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఒక వైద్యురాలిగా మీ బాధలు తెలుసు. మానవత్వంతో ఆదుకోవాలి అన్న జాలి, దయ ఈ ప్రభుత్వానికి లేదు. అందుకే మళ్లీ చంద్రన్నను గెలిపించుకుంటే పెన్షన్‌ పెరుగుతుందని తెలిపారు. మీ సంక్షేమం కోసం టీడీపీ హయాంలో గోను గుంట్ల కోటేశ్వరరావు ఎన్నో మంచి పనులు చేశారు. వారి సహకారంతో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

కార్పొరేషన్‌ మనుగడ సాగించాలన్నా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలన్నా టీడీపీ రావాల్సిన అవసరం ఉందన్నారు. నన్ను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటాను… ఆశీర్వదిం చాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను మోసం చేసిందని, టీడీపీ హయాంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమా వేశంలో విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధ్యక్షుడు పూదాటి సునీల్‌, అంటోని కుమార్‌, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సందు వెంకట్రావు, నియోజకవర్గ అధ్యక్షుడు పూసల ఓబయ్య, ఐదు మండలాల విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు, నియోజకవర్గంలోని దాదాపు 500 విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు.