– సూపరింటెండెంట్ వివరణ
పల్నాడు జిల్లా:నరసరావుపేట మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇటీవల కోడెల వర్ధంతి సందర్భంగా లింగంగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కోడెల విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే, దీనిని రాత్రికి రాత్రే అధికారులు తొలగించారు. దీంతో కోడెల అభిమానులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. విగ్రహం మాయంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మంత్రు నాయక్ ని గోరావ్ చేశారు. సూపరింటెండెంట్ కార్యాలయంలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అరవింద బాబు చెబితేనే విగ్రహం తొలగించామని సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు.