(వాసు)
‘కోడి ముందా? గుడ్డు ముందా?’ ఇది సరదాగా అప్పుడప్పుడు వినే మాట.కానీ దీనిపై లోతుగా పరిశీలిస్తే సరైన సమాధానం ఏంటనేది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే కోడి లేకుండా గుడ్డు రాదు.. గుడ్డు లేకుండా కోడి జన్మించదు. దీనిపై ఎన్నో పరిశోధనలు చేసినా ఇప్పటి వరకు సరైన విధంగా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.
కానీ కొందరు శాస్త్రవేత్తలుమాత్రం దీనికి సమాధానం ఎలాగైనా కనుక్కోవాలని శ్రమించారు. కొన్నేళ్ల పాటు పరిశోధనలు నిర్వహించిన తరువాత చివరకు ఓ విషయం కనుక్కొన్నారు. ఇంతకీ కోడి ముందా? గుడ్డు ముందా? పరిశోధనలు ఏం తేల్చారు? ఆ వివరాల్లోకి వెళితే..
ఈ భూమ్మీద సర్వ జీవులు నివసిస్తాయి. ఒక్కోటి ఒక్కోరకంగా జన్మిస్తాయి. కానీ పక్షి జాతికి చెందిన కొన్ని గుడ్లు పెట్టడం ద్వారా పురుడుపోసుకుంటాయి. ఈ క్రమంలో ఒక పక్షి పుట్టుకకు గుడ్డే కారణం అయినప్పుడు, ముందుగా ఈ భూమ్మీదకు గుడ్డు మాత్రమే వచ్చిందని తేల్చారు.
ఎన్నో ఏళ్ల కిందట భూమ్మీద గుడ్లు ఏర్పడ్డాయని, వీటి ద్వారా అనేక జీవాలు పుట్టుకొచ్చాయని వివరించారు. అయితే పూర్వకాలంలో ఉన్న గుడ్డు పరిమాణం చిన్నగా ఉండేది. అంతేకాకుండా ఇవి సముద్రంలో జెల్లి ఫిస్ లాగా ఉండేవి. వాటి ద్వారానే పక్షి జాతి ప్రారంభమైందని తేల్చారు.
ఈ విషయంపై ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన పాలియోంటాలజిస్ట్ డాక్టర్ ఎలెన్ మాథర్ తీవ్రంగా పరిశోధన చేశారు. ఆ తరువాత చివరకు ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. కోడి కంటే గుడ్డు ముందు వచ్చాయని తేల్చారు.
తాను చేసిన అధ్యయనం ప్రకారం లక్షల ఏళ్ల కిందట గుడ్లు భూమ్మీదకు వచ్చాయని, ఆ తరువాత కోళ్లు జన్మించాయని చెప్పాడు. అయితే ఆదిమానవుడు తన అవసరాల కోసం కోళ్లను తినడం ప్రారంభించారు. ఆ తరువాత కోడి గుడ్లను కూడా ఆహారంగా వినియోగించారు. అయితే కోడితో పాటు గుడ్లు కూడా ఆహారంగా ఉపయోగపడతుండడంతో వీటిలో ఏది ముందుగా పుట్టుంది? అనే విషయంపై తీవ్రంగా చర్చలు జరిగాయి.
అయితే దీనిపై ఇప్పటికే పరిశోధనలు ప్రారంభం అయ్యాయి. కొందరు శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం.. కోళ్లు మనుషులతో జన్మించాయని చెప్పారు. కానీ తాజా పరిశోధనల ప్రకారం క్రీస్తు శకం 1250 నుంచి 1650 మధ్యలో కోళ్లను మనుషులు మచ్చిక చేసుకోవడం ప్రారంభించారని తేల్చారు. అంటే 3,500 సంవత్సరాల నుంచి మాత్రమే కోళ్లు మనుగడలో ఉన్నాయని చెప్పారు. అంతకు ముందు ఇవి మనుషులకు అందుబాటులో లేవని అంటున్నారు. కాకపోతే అంతకుముందే గుడ్లు ఉన్నాయని, వీటి ద్వారా కోళ్లు బయటకు వచ్చి అడవుల్లో నివసించేవని చెప్పారు. అడవిలో ముందుగా వచ్చిన కోడి ‘రెడ్ జంగల్ ఫౌల్’ అని పేర్కొంటున్నారు. ఇది ముందుగా గుడ్డు నుంచి బయటకు వచ్చింది. ఆ తరువాత ఇది వివిధ మార్పులు చెంది మనుషుల వద్దకు చేరింది అని డాక్టర్ మాథర్ తెలిపారు.