-అమెరికా నుంచి చందాలు వసూలు చేస్తున్నాడు
-అమెరికా నుండి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి
-అందరి దగ్గర చందాలు వసూలు చేస్తాడు
-తిరువూరు టిడిపి అభ్యర్థి కొలికపూడిపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
తిరువూరు: అమరావతి ఉద్యమం పేరిట చంద్రబాబు పంపిస్తే హైదరాబాద్ నుండి వచ్చాడు. అప్పుడు మూడు నెలలు అతన్ని నేనే ఒక హోటల్ లో పెట్టాను అతని అరాచకాలు భరించలేక హోటల్ వారే గగ్గోలు పెట్టేవారు. అదే హోటల్ ఉండి అరాచకాలు చేస్తుంటే, హోటల్ ఖాళీ చేయించండి అంటూ హోటల్ వాళ్ళు బ్రతిమిలాడే పరిస్థితికి వచ్చారు హోటల్ ఖాళీ చేయించడానికి నేను నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది .
అమరావతి ఉద్యమం పేరిట రైతుల దగ్గర సైతం చందాలు వసూలు చేసేవాడు. అమరావతి నుండి తిరువూరు ని ఉద్ధరించడానికి వచ్చాడు కల్లుతాగే ముచ్చు . అమెరికా నుండి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి, మమ్మల్నీ డబ్బులు అడుగుతున్నాడేంటీ అని నన్ను అడుగుతున్నారు. తిరువూరు టిడిపి అభ్యర్థి ఒక కాలకేయుడు, కీచకుడు కూడా.
స్వామిదాస్ మీద కామెంట్ చేశాడట ఆ కాలకేయుడు, కీచకుడు. ఎవరైనా ఒక్కరు స్వామిదాస్ ఇబ్బంది పెట్టారని చెబితే నేను,స్వామిదాస్ ఇద్దరం పోటీ నుండి విరమిస్తాం. అమెరికా నుంచి చందాలు వసూలు చేస్తున్నాడు. ఆ డబ్బులు అన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. తిరువూరు లో ఉన్న డాక్టర్లు,వ్యాపారులు తెలుసుకోండి అతను అరాచకవాది అని. ఎవరిని వదలడు. అందరి దగ్గర చందాలు వసూలు చేస్తాడు.