Mahanaadu-Logo-PNG-Large

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాపం పండింది

– పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్

మంగళగిరి: ప్రస్తుతం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ రావడంతో పల్నాడు జిల్లా ప్రజలు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి మీద కేసు పెడతారో, ఎలాంటి అరాచకాలు జరుగుతాయో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. పల్నాడు జిల్లా మాచర్ల ప్రజలకి నేడు స్వాతంత్రం వచ్చింది. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. పిన్నెల్లి అరెస్టు ఆనందదాయకం.

పిన్నెల్లిని అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ నాయకులు చెప్పడం ఒక అభూత కల్పన మాత్రమే. వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యక విధానాన్ని తుంగలో తొక్కింది. పిన్నెల్లి, ఆయన సోదరులు చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. అక్రమ మైనింగ్ తో కోట్లు గడించారు పిన్నెల్లిని అరెస్టు చేయడం ఇదొక ట్రైలర్ మాత్రమే. పిన్నెల్లి చేసిన అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు అన్నింటిని బయటపెడతాం. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ఎమ్మెల్యే పిన్నెల్లి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అప్పుడు ఒక నియంతలా వ్యవహరించారు.

ప్రభుత్వానికి అందాల్సిన కప్పాలన్నింటిని తన జేబుల్లో నింపుకున్నారు. అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే రౌడీల చేత దౌర్జన్యాలు చేయించారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై హత్యా ప్రయత్నాలు జరిగిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. పిన్నెల్లి అరెస్టు సందర్భంగా టిడిపి యువ నాయకుడు ముందుకొస్తే అతనిపైన కూడా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు.

పిన్నెల్లి లో ఇంకా అహం చావలేదు. పిన్నెల్లికి జైలు కూడా తప్పదు. అహంకారంతోటి కొట్టుమిట్టాడుతున్నారు. పల్నాడు జిల్లా ప్రజలు విశ్వసనీయతకు మారుపేరు. అలాంటి వారిని ఇబ్బంది పెట్టారు. టిడిపి నాయకుల పై అనవసరంగా కేసులు పెట్టి వేధించారు. ఈ ఐదేళ్లు వైసిపి నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. టిడిపి నాయకుల పై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయించారు.

వైసీపీ నాయకులకు కూడా ఇదే పరిస్థితి రావచ్చని గ్రహించలేకపోయారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ధర్మమే నిలుస్తుంది. అందుకు నిదర్శనం టిడిపి గెలవడమే. ఇకమీదట వైసీపీ నాయకుల ఆటలు సాగవు. వైసీపీ పేజీ ముగిసింది. ఇక వైసిపి నాయకులు తోకముడవాల్సిందే. ఇక భవిష్యత్తులో వైసిపికి కాలం చెల్లింది.

కిరాయి గుండా లాగా వ్యవహరించారు: ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు
అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలకు వైసీపీ నాయకులు పెట్టని కోటగా ఉండేవారు. ఈ ఐదేళ్లు పల్నాడు గడ్డమీద గుట్కా, గంజాయి, డ్రగ్స్ మాఫీయా రాజ్యమేలింది. వైసీపీ ఎమ్మెల్యేలు, వారి మంత్రులు మాఫియా రాజ్యం ఏలారు. ఈ మాఫియాపై జగన్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏనాడూ చర్యలు తీసుకోలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయలేదు. పల్నాడు జిల్లాలో ఈ ఐదేళ్లుగా ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు.

పెద్దకోటయ్య, జల్లయ్య ఇలా ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారు. అనేకమంది పై హత్యా ప్రయత్నాలు జరిగాయి. వైసీపీ నాయకులకు భయపడి పల్నాడు జిల్లాను వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితిలో వచ్చాయి. ఇలాంటి దారుణాలు అనేకం జరిగాయి. ఇన్ని దారుణాలు జరుగుతున్నా.. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గాని, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాని మంచి, చెడుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.

ఒక్కసారికూడా ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి అని ఆలోచించలేదు. టిడిపి వారి ఇళ్ళపైకి దాడులు చేయడం జరిగింది. కిరాయి గుండాలతో, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని పరిపాలన సాగించారు. ప్రజలకు వారిపై ఎంత కోపం ఉంటుందో ఒకసారి కూడా వారు ఆలోచించలేదు. అలజడులు సృష్టించుకుంటూ వెళ్లారు. అందువల్ల మొన్న జరిగిన ఎన్నికల్లో మాచర్ల లో విపరీతమైన మెజార్టీ వచ్చింది. ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని వైసీపీ నాయకులు గ్రహించలేకపోయారు. ఎమ్మెల్యే అంటే కిరాయి గుండా లాగా వ్యవహరించారు.

పల్నాడు జిల్లాలో ప్రజలు టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. గెలిచినవారు మంచి పరిపాలన చేయాలి. ఎన్నికలప్పుడు రెంటచింతల మండలం పాల్వాయి లో ఏవీఎంలు పగలగొట్టడం జరిగింది. శిరోమణి మీద దాడి చేయడం జరిగింది. కారంపూడిలో నారాయణస్వామి పై దాడి జరిగింది. అనేకసార్లు టిడిపి నాయకులు కార్యకర్తల మీద దాడులు జరిగాయి.

వీటన్నింటిని ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారు. అందుకే సరైన శిక్ష వేశారు. అనేక దాడులు చేశారు. న్యాయమే ఎప్పుడూ గెలుస్తుంది. ఈ సందర్భంగా పిన్నెల్లి ని అరెస్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడం జరిగింది. గెలిచిన ఎమ్మెల్యేలు నీతి నిజాయితీతో ఉండి ప్రజలకు అండగా నిలవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అందుకు కలిసికట్టుగా కృషి చేయాలి. ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి అందుకు అందరూ ఏకమవ్వాలి.

పిన్నెల్లి బ్రదర్స్ ని ప్రజలు నరరూప రాక్షసులు: ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
కోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకెళ్లాడు. గత ఐదు సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దోపిడీకి ఉపయోగించుకున్నారు. అనేకమంది తెలుగుదేశం కార్యకర్తలను, చంద్రయ్యని, జల్లయనను పొట్టను పెట్టుకున్నారు. చనిపోయిన వాళ్ళ బంధువులను కూడా ఇరికించి పాపాలు చేశారు. అనేకచోట్ల భూములు కబ్జాలు చేశారు. ప్రజల ఆస్తులు కబ్జా చేశారు. లిక్కర్ మాఫియాకు పాల్పడ్డారు. చేయని నేరాలు లేవు నేరాలు-ఘోరాలు లేవు. దోపిడీలు చేసిన పల్నాడు బ్రదర్స్ ని ప్రజలు నరరూప రాక్షసులుగా చూశారు.

ఈరోజు ప్రజలందరూ ఇలాంటి వారిని దేశ ద్రోహం కింద తరిమేయాలి. చేసిన పాపాలు పండాయి. ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసుల చేత చట్టాన్ని తుంగలో తొక్కించారు. అనేక తప్పులు చేయించారు. టిడిపి నాయకుల పైన దాడులు చేయించారు. అనేక బూత్ లు ఆక్రమించుకున్నారు. విధ్వంసాలు సృష్టించారు. దోపిడీ, దౌర్జన్యాలు చేశారు. ప్రజల్ని హింసించారు.

ఈ దుర్మార్గులకు ప్రజా కోర్టులో శిక్ష పడింది. వీరు చేసిన నేరాలు అన్ని వెలికి తీసి వీరిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నరరూప రాక్షసులను వదలకూడదు. వీరందరూ జైళ్ళల్లో ఉండాలి. సహకరించిన అధికారులు, చట్టాలను తుంగలో తొక్కిన అధికారుల్ని వదలకూడదు. దర్యాప్తు జరపాలి. తప్పు చేసిన అధికారులను చట్టానికి పట్టివ్వాలి.
అక్రమాలకు పాల్పడిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతాం. తప్పు చేసిన అధికారులు, పిన్నెల్లి బ్రదర్స్ కి శిక్ష తప్పదు. పిన్నెల్లి తో పాటు అనేక అక్రమాలు చేసిన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని కూడా వెంటనే అరెస్టు చేయాలి.