– బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో సర్ప్రైజ్ విజిట్
– పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సర్ప్రైజ్ విజిట్ చేశారు. శనివారం బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలోని నగర పంచాయతీ కార్యాలయానికి ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె.. కమిషనర్ రమణబాబు గారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయంలో సిబ్బంది పనితీరును పరిశీలించారు. పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.
ప్రధానంగా నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిగారి దృష్టికి తెచ్చారు. దాంతో ఆ సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి పరిష్కరించాలని ఎమ్మెల్యే కమిషనర్‌ను ఆదేశించారు. అదేవిధంగా నీటి నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రజా మరుగుదొడ్ల సమస్యలపై కూడా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిగారు ఆరా తీశారు.
బుచ్చి పట్టణ అభివృద్ధిపై యాక్షన్‌ప్లాన్ తయారు చేయాలని, ఎక్కడా నిర్లక్ష్యం వద్దని ప్రశాంతిరెడ్డిగారు ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో డయేరియా కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో దీనిపై దృష్టి సారించాలన్నారు. ఒక్క డయేరియా కేసు కూడా నమోదు కాకూడదని ఆదేశించారు. దోమల వ్యాప్తి జరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.