వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి, స్టార్ డైరెక్టర్స్ కొరటాల శివ, అనీల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజమౌళి, కొరటాల శివ, అనీల్ రావిపూడి, గోపీచంద్ మలినేని చేతుల మీదుగా ‘కృష్ణమ్మ’ ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా…. చిత్ర సమర్పకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘‘రాజమౌళిగారికి స్పెషల్ థాంక్స్. గోపీ, అనీల్‌కి థాంక్స్. ‘కృష్ణమ్మ’ సినిమా కథ వినమని నిర్మాత కృష్ణ చెప్పగానే డైరెక్టర్ గోపాలకృష్ణ వచ్చి కథ చెప్పాడు. వినగానే ఈ సినిమాలో నేను భాగం అవుతానని చెప్పాను. అలా నేను ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించాను. డైరెక్టర్ గోపాలకృష్ణ సినిమాను చక్కగా రాసుకున్నాడు. షూటింగ్ పూర్తి చేసి తనే సినిమా చూపించాడు. మంచి టీమ్.. మంచి ఎఫర్ట్‌తో సినిమా చేశారు. సత్యదేవ్.. నేను చూసిన మంచి నటుల్లో తనొకడు. ఎంత పెద్ద డైలాగ్ అయినా, సీన్ అయినా సులభంగా చేసేయగలడు. ‘కృష్ణమ్మ’తో తను మరింత మంచి స్థానాన్ని చేరుకుంటాడని ఆశిస్తున్నాను. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కు అభినందనలు. కాల భైరవ చాలా మంచి సంగీతాన్ని ఇచ్చాడు. ప్రతి పాట సిట్యువేషన్‌ను బట్టి గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. తనకు ఆల్ ది బెస్ట్. నిర్మాత కృష్ణతో ఎప్పటి నుంచో మంచి పరిచయం ఉంది. ఈ సినిమాతో తనకు మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. మే 10న రిలీజ్ కాబోతున్న ‘కృష్ణమ్మ’కు పెద్ద విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు.
పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ‘‘‘కృష్ణమ్మ’ మూవీతో సమర్పకుడిగా మారుతున్న కొరటాల శివగారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారంటే అందరికీ స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది. శివగారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గోపాలకృష్ణ టీజర్, ట్రైలర్లలో తక్కువ షాట్స్‌లోనే చాలా ఎట్రాక్టివ్‌గా, సినిమాను థియేటర్స్ చూడాలనిపించేలా చేశాడు. తనకు ఆల్ ది బెస్ట్. సత్యదేవ్ నటనలో ఏ ఎమోషన్‌ను అయినా పలకించగలడు. అలాంటి వారు చాలా తక్కువగా ఉంటారు. తనకు సరైన ఓ సినిమా పడితే స్టార్‌గా ఎదుగుతారు. ‘కృష్ణమ్మ’తో తను స్టార్ అవుతాడని భావిస్తున్నాను. సత్యదేవ్ సహా టీమ్‌కు ఆల్ ది బెస్ట్. కాలభైరవ కథ వినేటప్పుడే కథలోని మెయిన్ ఎమోషన్ ఏంటి.. నేనేం చేయాలని ఆలోచిస్తాడు. తను అలాగే ఇన్‌టెన్సిటీతో మ్యూజిక్ ఇస్తాడు. టీజర్, ట్రైలర్‌కు తను ఇచ్చిన మ్యూజిక్ వింటుంటే గర్వంగా అనిపించింది. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.