మానవత్వం చాటుకున్న కేటీఆర్!

– యాక్సిడెంట్ బాధితులను తన అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలింపు

జిల్లెల్ల, మహానాడు: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తన నియోజకవర్గం సిరిసిల్ల నుంచి హైదరాబాద్ కు వస్తుండగా మార్గమధ్యంలో సిరిసిల్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో జిల్లెల్ల వద్ద జరిగిన యాక్సిడెంట్ ను గమనించారు. వెంటనే స్పందించి, గాయపడిన వ్యక్తులను తన ఎస్కార్ట్ వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కావటంతో ఆయనే అంబులెన్స్ కు కాల్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారిని హాస్పిటల్ ను వేగంగా తరలించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ చేసిన పనిని పలువురు ప్రశంసించారు.