గుంటూరు పరిధిలో అన్ని సీట్లలో విజయావకాశాలు
అవినీతి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి
టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్
జనసేన పశ్చిమ డివిజన్ అధ్యక్షులతో సమావేశం
గుంటూరు, మహానాడు : వారాహి యాత్ర ప్రభంజనం ద్వారా ఎన్డీఏ కూటమి లక్ష్యాలు మరోసారి ప్రజ ల్లోకి బలంగా వెళ్లాయని, అవినీతి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గ జనసేన డివిజన్ల అధ్యక్షులతో స్థానిక జనసేన కార్యాలయంలో సోమవారం సమన్వయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటు పరిధిలో అన్ని నియో జకవర్గాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని, తమను ఎదుర్కోవటం అసాధ్యమని తెలిసిన కొందరు వైసీపీ నేతలు అవినీతి సొమ్ముతో కక్కుర్తి రాజకీయాలకు తెరతీస్తున్నారని వివరించారు. స్థానికంగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గల్లా మాధవితో కలిసి రాబోయే 25 రోజుల ఎన్నికల పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుని, ముందుకు వెళుతున్నామని తెలిపారు.
పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గల్లా మాధవి మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటామని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బోన బోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెనాలిలో జరిగిన వారాహి యాత్ర దిగ్విజయానికి సహకరించిన కూటమి పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ ప్రయత్నించిన రాయి దాడి డ్రామా ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు చంద్రబాబు, పవన్‌పై రాళ్ల దాడి చేయిస్తున్నారని విమర్శించారు. గుంటూరు లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు చలించిన పెమ్మసాని, నీతికి నిలబడే టీడీపీకి మద్దతు ఇవ్వడానికి వచ్చారని అన్నారు. గుంటూరు పశ్చిమలో 50 వేలు మెజారిటీతో పాటు పార్లమెంటులో 2 లక్షల మెజారిటీతో విజయదుందు భి మోగించబోతున్నామని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, జనసేన నాయకులు ఆళ్ల హరి తదితరులు పాల్గొన్నారు.