Mahanaadu-Logo-PNG-Large

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా లాఖ్‌పతి, డ్రోన్‌ దీదీలు!

ఢిల్లీ ఎర్రకోటలో జరిగే 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పంచాయతీ రాజ్‌ సంస్థల నుంచి 400 మంది మహిళలను కేంద్రం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఇందులోభాగంగా 45 మంది లాఖ్‌పతి దీదీలు, 30 మంది డ్రోన్‌ దీదీలు హాజరు కానున్నారు. స్వయం సహాయక సంఘ్‌ కింద మహిళలకు వివిధ రకాల నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి.. వారు ఏడాదికి కనీసం రూ.లక్ష స్థిర ఆదాయం పొందడమే లాఖ్‌పతి దీదీ పథకం. అలాగే మహిళలకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇవ్వడమే డ్రోన్‌ దీదీ పథకం.