అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి సోమవారం సంస్థ ప్రధాన కార్యాలయములో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంస్థ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వివిధ విభాగాల అధిపతులతో సమావేశమై ప్రస్తుతం అమరావతిలోని నిర్మాణాల పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో సంస్థ ముఖ్య ఇంజినీరు సీహెచ్. ధనుంజయ్, సూపరిండెంట్ ఇంజినీరు భాస్కర్, సీఏవో ఉమామహేశ్వరి, ఉద్యానవన అధికారి హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.