వైసీపీ హయాం లో భూవివాదాలు అధికం

– బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య నారాయణ రాజు

విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో నిర్వహించే వారధి కార్యక్రమం లో వైసీపీ హయాం లో భూవివాదాల సమస్యల పై వినతులు అధికంగా వస్తున్నాయి. వారధి లో వినతులను బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు స్వీకరించారు.

అనేక ప్రాంతాల్లో వైసీపీ నేతలు భూకబ్జా లకు పాల్పడ్డారని ఆనాటి బాదితులు న్యాయం చేయాలని వినతి పత్రాలు సమర్పించారని సూర్య నారాయణ రాజు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత జూపూడి రంగరాజు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, వారధి సమన్వయ కర్త కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు