రికార్డులు మార్చి వైసీపీ నేతల భూ దోపిడీ

ఫలితాలు వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట, మహానాడు : రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల తారుమారుతో వైకాపా నాయకులు సాగిస్తున్న భూదోపిడీ ప్రమాదకర స్థాయికి చేరిందని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపా టి పుల్లారావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూముల కబ్జాలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పులపై కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఇటీవలి హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం ఆయన స్పందించారు. రెవెన్యూ సిబ్బంది సాయంతో వెబ్‌ల్యాండ్‌లో ఇష్టానుసారం మార్పులు చేస్తూ ప్రభుత్వ, ప్రైవేటు భూములు కొట్టేస్తున్నారని వాపోయారు. ఫలితాలు వచ్చే వరకు రెవెన్యూ రికా ర్డులలో మార్పులు, చేర్పులు చేయకుండా అడ్డుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో భూముల విస్తీర్ణాన్ని సరిచూసుకుంటూ ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దుతో పాటు వైకాపా నేతల భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.