వికసిత్‌ భారత్‌ డిజిటల్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు : రానున్న రోజుల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించబోతోం దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలపై రూపొందించిన వికసిత్‌ భారత్‌ డిజిటల్‌ క్యాలెండర్‌ను ఆదివారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2047 నాటికి వికసిత భారత్‌ థీమ్‌తో భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫె స్టో (సంకల్ప పత్ర)ను విడుదల చేయడం జరిగిందన్నారు. రేషన్‌ను వచ్చే ఐదేళ్లుఉచితంగా అందించనున్నట్లు చెప్పారు.

మధ్యతరగతి కుటుంబాల్లోని వృద్ధులకు రూ.5 లక్షలతో ఆయుష్మాన్‌ భారత్‌తో సేవలు అందుతాయని ఇదొక గొప్ప నిర్ణయమన్నారు. దేశంలో గత పదేళ్లలో 4 కోట్ల ఇళ్లు నిర్మించగా.. రానున్న రోజుల్లో పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నా రు. బ్లూ రెవల్యూషన్‌ కింద మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ కోసం తోడ్పాటు, గిగ్‌ వర్కర్స్‌, ఆటో, ట్యాక్సీ కార్మికులకు చట్టబద్ధత కల్పిస్తూ ఈ-శ్రమ్‌ కార్డు కింద రిజిస్ట్రేషన్‌ చేయించి వారి కుటుంబాలకు విద్య, వైద్యం, ఇన్సూరెన్స్‌, పెన్షన్‌ సదుపాయం కల్పించేలా కొత్త పథకం తీసుకు రానున్నట్లు వివరించారు. భారత్‌ను రానున్న రోజుల్లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ముద్ర రుణాల పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.