నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట పట్టణం తిరుమల అపార్ట్‌మెంట్‌లో ఆర్యవైశ్య సభ్యులతో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు సమావేశమయ్యారు. నరసరావుపేటలో టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. వ్యాపారాలు సవ్యంగా జరిగేందుకు సహకరిస్తామని, నిత్యం అందుబాటులో ఉండి సమస్యల్లో తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేగా తమను ఆశీర్వదిం చాలని విజ్ఞప్తి చేశారు.