ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది

– రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి

అమరావతి : కూటమి ప్రభుత్వ పాలనలో 30కిపైగా హత్యలు, 300కి పైగా హత్యాయత్నాలు, 490 ప్రభుత్వ ఆస్తులను, 560 ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు.శాంతి భద్రతలు క్షీణించిన ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అఖిలపక్ష సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. కానీ.. టీడీపీ ఆ ఊసే ఎత్తలేదు. బీజేపీతో టీడీపీ పూర్తిగా రాజీపడినట్లు కనిపిస్తోంది.