రోడ్ల పనులకు మ్మెల్యే ముత్తుముల శంకుస్థాపన

రాచర్ల, మహానాడు: పల్లె పండుగ – ప్రగతికి అండగా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు రాచర్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన వారోత్సవాల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాచర్ల గ్రామ పంచాయతీలోని ఫారం గ్రామంలో రూ. 10 లక్షలు, పలుగుంటి పల్లె గ్రామంలో రూ. 10 లక్షలు, రాచర్ల గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలు మొత్తం రూ. 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంతర్గత సిమెంట్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా గ్రామంలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఎంపీడీఓ వెంకట రామిరెడ్డి, ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్ డీఈ సుబ్బారెడ్డి, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పీడీ జోసఫ్ కుమార్, హోసింగ్ ఏఈ విజయకుమారి, మండల పార్టీ అధ్యక్షుడు కటికే యోగానంద్, జిల్లా నాయకులు గోపిరెడ్డి జీవనేశ్వర రెడ్డి, దప్పిలి కాశిరెడ్డి, షేక్ తాహీర్ బాషా, పంకా మాధవ్, వీరాచారి, యల్లా కృష్ణ, సొంటం కల్యాణ్‌ రెడ్డి, వేల్పుల రంగరాజు, మనోహర్, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.