Mahanaadu-Logo-PNG-Large

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు 

గుర్తింపు కార్డులను అందజేస్తున్న యరపతినేని శ్రీనివాసరావు,  జంగా కృష్ణమూర్తి  

రాయితీపై కంది విత్తనాలు పంపిణీ  
*  కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేత 
* కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

గురజాల, మహానాడు :  గురజాల పట్టణంలోని చల్లగుండ్ల గార్డెన్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కంది విత్తనాల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చేతుల మీదుగా రైతులకు కంది విత్తనాలు పంపిణీ, కౌలు రైతులకు గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమానికి ముందుగా దివంగత మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.