నాదెండ్ల భాస్కర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు

జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

తెనాలి, మహానాడు : జనసేన పార్టీ నాయకులు, తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ తండ్రి, ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాథ్, ముమ్మలనేని సతీష్ బాబు, యడ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.