మంగళగిరి నియోజకవర్గం ఎన్నికల చరిత్రలో అతి తక్కువ మెజారిటీతో గెలిచింది ఆళ్ల రామకృష్ణారెడ్డి. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆళ్ల రామకృ ష్ణారెడ్డి అప్పటి టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై 12 ఓట్ల తేడాతో గెలిచారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ అత్యధిక మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పుడు సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన డి.లక్ష్మయ్య ఇప్పటివరకూ 17,265 ఓట్ల మెజారిటీతో హయ్యస్ట్‌గా నిలిస్తే లోకేష్ సునామీతో దానిని అధిగమించి రికార్డ్ సృష్టించాడు.