మూర్తి యాదవ్‌పై న్యాయపరమైన చర్యలు

న్యాయవాదులతో జవహర్‌రెడ్డి సంప్రదింపులు

అమరావతి: ఇటీవల విశాఖపట్నంలో జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ తనపై చేసిన ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిఎస్‌ జవహర్‌ రెడ్డి న్యాయనిపుణులతో సంప్రదించారు. గతంలో న్యాయపరంగా తగిన చర్యలు తీసుకుందామని న్యాయ నిపుణులు వివరించారు. ఈ నిరాధార, అవాస్తవ ఆరోపణలపై విశాఖ జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌కు త్వరలో లీగల్‌ నోటీసు జారీ చేయనున్నారు.