మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత!

హైదరాబాద్, మహానాడు: మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి చిరుత కదలికలు కనిపించాయి. ఈ మేరకు పలువురు యువకులు దానిని వీడియో తీశారు. అనంతరం మెట్రో అధికారులు, పోలీసులకు సమాచారం చేరవేశారు. అప్రమత్తమైన పోలీసులు మియాపూర్ పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎవరికైనా అది కంటపడితే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. స్థానికుల సాయంతో చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వీడియోలో ఒకే చిరుత కనిపిస్తోంది. పరిసర ప్రాంతాల్లో ఇంకా ఏమైనా చిరుతలు ఉన్నాయేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.