Mahanaadu-Logo-PNG-Large

స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం

-భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుదాం
-హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారభించిన బీసీ సంక్షేమ,చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ

పెనుకొండ: శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణ కేంద్రంలో గాంధీ విగ్రహం నుండి హర్ఘర్ తిరంగ సందర్భంగా జాతీయ జెండా ను ఊపి ర్యాలీ ని ప్రారంభించి అంబేద్కర్ సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకొని మానవహారం చేశారు.

అనంతరం మంత్రి సవితమ్మ మాట్లాడుతూ మీడియా తో మాట్లాడుతూ… 78 వ స్వాతంత్ర్య వేడుకలు సందర్భంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని , దేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది వీరులు త్యాగం చేసి 200 సంవత్సరాల బ్రిటీష్ పాలకులు పరిపాలన నుంచి దేశ విముక్తి చేశారన్నారు.

ప్రతి భారతీయునిలో దేశ భక్తి పెంపొందించేలా హర్ఘర్ తిరంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని మంత్రి సవితమ్మ తెలియచేసారు. స్వాతంత్ర సమరయోదుల నిస్వార్ధ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొని సత్కరించుకోవాల్సి ఉందన్నారు.

ఆజాదీ అమృత్ మహోత్సవ్ భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించి హర్ఫర్ తిరంగా కార్యక్రమాలను జిల్లాలో ప్రతి మండల కేంద్రాల్లో, గ్రామాల్లో వాడవాడలా జాతీయ సమగ్రతను స్మరించుకునే విధంగా జాతీయ జెండా ను ఎగర వేయాలని తెలియచేసిన మంత్రి సవితమ్మ ఈ కార్యక్రమంలో అధికారులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు,నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు