వినుకొండను అభివృద్ధి చేద్దాం
టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం
నూజెండ్ల మండలంలో ఘనస్వాగతం
పల్నాడు జిల్లా వినుకొండ, నూజెండ్ల, మహానాడు: అధికార అహంకారంతో రెచ్చిపోతున్న బూతుల బ్రాహ్మనాయుడును గద్దె దించి విను కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకి తీసుకువెళదామని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జి.వి.ఆం జనేయులు పిలుపునిచ్చారు. వినుకొండ నియోజక వర్గం నూజెండ్ల మండలం ఉప్పలపాడు, గురపనాయుడుపాలెం, నూజెండ్ల, రవ్వవరం, మేకపాడు, బుర్రిపాలెం గ్రామాల్లో బుధవారం వారు ప్రచారం నిర్వహించారు. మండుటెండలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వారితో పాటు బీసీ నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే గ్రామాల్లో ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించుకుందామని సూచించారు. జలజివన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ నీరందిస్తామని తెలిపారు. వరికెపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేసుకుం దామని పేర్కొన్నారు. ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.