సినీ హీరో నారా రోహిత్
కావలి: వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని మొన్నేదిన్నేపాలెంలో ఎన్డీయే కూటమికి మద్దతుగా బుధవారం రోహిత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వైసీపీ పాలన అప్పులతో శ్రీలంకలా తయారైందని విమర్శించారు. ఈ ప్రచారంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కన్వీనర్ అట్లూరి నారాయణరావు, తాడికొండ సాయికృష్ణ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.