– బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి
విజయవాడ, మహానాడు: తెలుగు భాష తియ్యదనం మరువకూడదని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం తెలుగు భాషా దినోత్సవం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సభకు బీజేపీ టీచర్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వర రావు, వామరాజుసత్య మూర్తి, పార్టీ మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్, కిలారు దిలీప్, భవిరి రవీ, లేఖ్యాభరణి తదితరులు వేదికను అలంకరించారు.
నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్ళు ఇంగ్లీషును పెంచి పోషించాలని చూసారు… మా నాన్నగారు మూలారెడ్డి పేరుతో ప్రతి సంవత్సరం నాటికలు నిర్వహిస్తాం.. తెలుగు భాష అవసరం అందరం చెపుతున్నాం…. ఆచరణ లో ఎలా ఉందో అందరికీ తెలుసు.. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు మాతృభాషలోనే చేయాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి… అంతరించి పోతున్న 7వ భాషగా తెలుగు ఉంది… పాశ్చాత్య భాష, సంస్కృతి మనం ఆదరిస్తే.. ప్రభుత్వాలు ఏం చేయలేవు.. విదేశాలలో మన సంస్కృతిని పెంచాలని చూస్తుంటే… మనం మన సంస్కృతిని వదిలేస్తున్నాం.. తెలుగు మాట్లాడటం చిన్నతనంగా భావించడం కాదు.. తెలుగు భాషా తియ్యదనం మనం మరువ కూడదు..తెలుగు సాహిత్యం విలువ లతో కూడి ఉంటుందన్నారు.