కల్వకుర్తి రోడ్‌షోలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
నాగర్‌కర్నూల్: బీఆర్‌ఎస్‌కు 10-12 సీట్లు ఇస్తే మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. గుంపు మేస్త్రి ఇంటికి సాగనంపుదామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెం ట్ పరిధిలోని కల్వకుర్తిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఆరు గ్యారంటీల్లో ఐదు అమలైనయ్ అంటుండు. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు రూ.2500, స్కూటీలు, తులం బంగారం వచ్చినయా? అని ప్రశ్నించా రు. స్కూటీలు లేవు…కాంగ్రెసోళ్ల లూటీ మాత్రం మొదలైందని ధ్వజమెత్తారు. లంకెబిందెల ఉంటాయను కుని వచ్చినా అని అంటున్నాడు. దొంగలు కదా వాటి కోసం వెతికేది. రేవంత్ రెడ్డివి అన్నీ రోత మాటలేన న్నారు. నమో అంటే నరేంద్రమోదీ కాదు… నమ్మించి మోసం చేసే వ్యక్తి అని మండిపడ్డారు. పేదలను కొట్టి పెద్దలకు దోచిపెట్టారని విమర్శించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కాంగ్రెస్ పదవి ఆశ చూపినా బీఆర్‌ఎస్‌లో చేరాడు. ఆయనను గెలిపించాలని కోరారు.