Mahanaadu-Logo-PNG-Large

ఊపిరి పీల్చుకుందాం..సంబరాలకు సిద్ధం కండి!

చీకటి పాలనకు విముక్తి పలుకుదాం
ఊరూరా పండుగ చేసుకుందాం
పిండి వంటలు వండుకుందాం
సహపంక్తి భోజనాలు చేద్దాం
ప్రజాస్వామ్య పరిరక్షణ దినం జరుపుకుందాం

` మూడురోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే, దేవుడు కరుణిస్తే మంచిరోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చీకటి తొలగి కాంతి వచ్చేరోజు సరిగ్గా నాలుగురోజుల దూరంలో ఉంది.

`చరిత్రలో కిచకుడు, బకాసురుడు, ఔరంగజేబుల కంటే అత్యంత దారుణమైన, నీచమైన, అధ్వానమైన, దుర్మార్గమైన పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలు పడ్డ కష్టాలు, కన్నీటి కథలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే రోజు దగ్గరకు వచ్చేసింది.

`ఈ చీకటి రోజులకు విముక్తి సంబరాలకు మనం ఇప్పటి నుండే తయారు కావాలి. ఆంధ్ర ప్రజలారా ఊపిరి పీల్చుకుందాం. ఆంధ్ర మాత, మా స్వేచ్ఛకు నీవే తార్కాణం. ఊరురా సంబరాలు ప్లాన్‌ చేసుకుందాం. వీధి, వాడ తోరణాలు కడు దాం. పూలతో అలంకరణలు చేద్దాం. పిండి వంటలు వండుకుందాం. కేక్‌లు కట్‌ చేసుకుందాం. వీధిలో, ఊరిలో అందరినీ పిలిచి వెయ్యేళ్ల ప్రజాస్వామ్యం నిలిచేలా పండుగలు చేసుకుందాం. రోడ్డు మీద బట్టీలు కట్టి పలావ్‌లు, పులిహోర, ఉగ్గాని, రాగి సంగటి, పరమాన్నం, పొంగలి వండుకుందాం..పంచుకుందాం.

`జగన్‌రెడ్డి పాలనలో తెగిపడిన విగ్రహాలు, అవమానాలకు గురైన దేవాలయాలు, మసక బారిన మసీదులు, ఆదరణకు నోచుకోని చర్చిలకు మొక్కులు తీర్చుకుం దాం. పూజారులు, ఇమామ్‌లు, ఫాదర్స్‌ను దర్శించి మంచిరోజులు వచ్చాయి అని గుండె ధైర్యం చెప్పి వారి నోరు స్వీట్స్‌తో తీపిచేద్దాం.

` వేడుక చేసినా, వంట చేసినా, కేక్‌ కట్‌ చేసినా, పండ్లు పంచినా వైసీపీ రౌడీలు తప్ప సమాజంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని పార్టీల వారిని కలుపుకుని వెళదాం. సహపంక్తి భోజనాలు చేద్దాం. అందరినీ గట్టిగా ఆలింగనం చేసుకుని ధైర్యం చెబుదాం.

`స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అన్నవి ప్రజలకు ఆక్సిజన్‌ లాంటివి. అవి లేని నాడు బతికినా చచ్చినట్లే. అలా ప్రతిరోజూ చస్తూ జగన్‌ రెడ్డి పోలీసుల అరాచక పాలన లో ప్రాణాలు ఉగ్గ పట్టుకుని కసిగా బయటకు వచ్చి మీ ఓటు హక్కుతో నిరంకుశ పాలన అంతం చేసిన ప్రతిఒక్కరికీ పాదాభివందనం.

`పతంగులు ఎగురేద్దాం. మూడు పార్టీల జెండాలతో మువ్వన్నెల జెండా కూడా ఎగురవేద్దాం. పసుపు, ఎరుపు, కాషాయ రంగుల గొడుగులతో వీధులు నింపి ఎండ రాకుండా మన సందులు అలంకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేద్దాం. ఎద్దుల కొమ్ములకు రంగులు, గుమ్మాలకు రంగులు, రచ్చబండకు రంగులు, ఊరి సెంటర్‌లో ఆ ఊరి పేరు సిమెంట్‌తో రాసి సోషల్‌ మీడియాలో ఫొటోలు పెట్టుకుం దాం.

`ఈ గెలుపు మహిళల గెలుపు, మన చిన్నారుల గెలుపు, మన యువత గెలుపు, మన సీనియర్‌ సిటిజన్‌ల గెలుపు, మన బడుగు, బలహీన వర్గాల గెలుపు. ప్రజలు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా తమ స్వేచ్ఛ, స్వాత్రంత్ర, ప్రజా హక్కుల కోసం ఎలుగెత్తి పోరాడిన రోజు. ఇది మన ఐక మత్యానికి ప్రతీక అయిన రోజు. మోసం, అబద్ధం, కుట్ర, క్షోభ, అరాచకం నుంచి ప్రజలు తమను తాము విముక్తి చేసుకున్న రోజు.

`వారంరోజుల పాటు అందరం హ్యాపీ మూడ్‌లోకి వెళ్లిపోదాం. ఆరు కోట్ల ఆంధ్రుల గుండె మీద చెయ్‌ వేసుకుని హాయిగా ఉండాల్సిన రోజూ వచ్చేసింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మన ఆఫీసర్స్‌కు స్వీట్స్‌ పంచుదాం. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో మన అధికారులకు కేక్‌లు కట్‌ చేసి పెట్టి మన ప్రజాస్వామ్యాన్ని కాపా డిన వారికి చేయేత్తి సెల్యూట్‌ చేసుకుందాం. వీధులలో ఎన్టీఆర్‌, చిరంజీవి, బాలయ్య, పవన్‌కళ్యాణ్‌ పాటలు పెట్టి డ్యాన్స్‌లు చేసుకుందాం. గోడల మీద తెరలు వేసి సినిమాలు వారంపాటు వేసుకుందాం. కోళ్లు, మేకలు కోసి మొక్కులు తీర్చుకుందాం. ఓపెన్‌ టాప్‌ జీపులలో విజయ యాత్రలు చేసుకుందాం.

`చిన్నారులు, పెద్దలు అందరూ ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ దినం రోజు, చీకటి పాలన అంతం అయిన రోజు వీధి వాడ నర్తించండి. హుషారుగా కేరింతలు కొట్టం డి. టపాకాయలు కాల్చండి. ఒక్క వ్యక్తి లేదా ఒక్క పార్టీ ఇలా ప్రజల కనీస హక్కు లు లేకుండా చేసే దినం మళ్లీ రాకుండా కాపలా కాసుకుందాం. ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైనది. ఆ హక్కు లేకుండా చేసే ఏ నాయకుడు అయినా హిట్లర్‌ వంటి వాడే. గాంధీ, అంబేద్కర్‌, అబ్రహం లింకన్‌, మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ల గురించి తెలుసుకోకుండా మూర్ఖత్వంతో పరిపాలన చేసేవాడే సమాజానికి హానికరం.

`జగన్‌ రెడ్డి అరాచక పాలన అంతంలో ప్రతిఒక్కరి శ్రమ ఉంది. ప్రతిఒక్కరి బాధ ఉంది. బాధ్యత కూడా ఉంది. అందుకే మన పండుగలలో అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు తప్పకుండా ఉండాలి. అలా ఉం టేనే ఈ విజయానికి అర్థం ఉంటుంది అన్న నిజం మరువవద్దు.

`మన ఆనందం ఆపుకోవద్దు. సంతోషం పంచుకుంటే పది కాలాల పాటు ఉంటుంది. మన ఆరోగ్యానికి మంచిది కూడా. ‘‘సైకో పోవాలి, సైకిల్‌ రావాలి పాట’’, ‘‘హల్లో ఏపీ, బై బై వైసీపీ’’, కొమరం పులి పాటలు ప్రతి ఇంటిలో, షాప్‌ లలో మారుమోగాలి. సిద్ధమా? పదండి ఇక టపాసులు సేకరిద్దాం…

` చంద్ర మల్లిపూడి