కలసికట్టుగా పార్టీని గెలిపిద్దాం

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

గుంటూరు, మహానాడు : వ్యక్తిగత స్వలాభం కోసం కాకుండా పార్టీని నిలబెట్టుకోవడానికి పార్టీని గెలిపించుకోవడానికి మనమంతా కలసికట్టుగా పని చేద్దామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక నూకల రామకోటేశ్వరావు కళ్యాణ మండపంలో శనివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఇంతకాలం నాతో కలిసి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు. గతంలో మనకు ఎదురైనా చేదు అనుభవాలను గుర్తుంచుకొని కలిసి పనిచేద్దాం. అలా కలిసి పనిచేయలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకుంటాను. గడిచిన పలు దఫాల అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక్కచోట అవకాశం వస్తుందని భావించాను. అవకాశం లేకపోయినా బాధ లేదు. మనకు సీటు ఇస్తాను అన్న గుంటూరు, కృష్ణ, జిల్లాల్లోని ప్రతి చోట నాకు అనుకూలంగా సర్వే ఉన్న నాకు అవకాశం రాలేదు. అయినా పార్టీ చెట్టు లాంటిది. చెట్టు సక్రమంగా ఉంటేనే ఆ నీడనే మనమందరం మనగలుగుతాము. నా వ్యక్తిగత స్వార్దం కన్న సమాజ శ్రేయస్సే తనలో ఎక్కువ. స్వలాభం కోసం వ్యక్తిగత స్వార్దం కోసం కాకుండా పార్టీ కోసం అందరం కలిసి కట్టుగా పని చేద్దాం.